హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సిమెంట్ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

PLD: యలమంద పరిధిలోని శ్రీనివాస గిరిజన, శివ సంజీవని కాలనీలలో రూ.40 లక్షలతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డు పనులకు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు శంకుస్థాపన చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ లక్ష్యమని, కాలనీల అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.