హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురుకులంలో ఎంపీవో తనిఖీ

SRPT :​ సూర్యాపేట మండలంలోని తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల (బాలురు-1)ను ఎంపీవో లింగారెడ్డి ఇవ్వాళ పరిశీలించారు. పాఠశాల ఆవరణ, మరుగుదొడ్లు, నీటి వసతి తదితర పారిశుద్ధ్య ఏర్పాట్లను తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరిసరాలను నిరంతరం శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఇందులో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.