హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధిలో NO.1 దిశగా నెల్లూరు జిల్లా: CM

NLR: సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లాకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. 'ప్రపంచంలోని వెయ్యి నగరాల్లో నెల్లూరుకు చోటు దక్కింది. కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులు, దగదర్తి విమానాశ్రయం, రైల్వే లైన్ల విస్తరణతో రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. BPCL ప్లాంట్ ద్వారా రూ.లక్ష కోట్ల పెట్టుబడులు, రక్షణ రంగంలో రూ.3,500 కోట్ల పెట్టుబడులు రానున్నాయని' అని CM పేర్కొన్నారు.