VZM: విద్యార్థికి నీతి నిజాయితీ, క్రమశిక్షణ కీలకమైనవని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం గజపతినగరంలోని ప్రతిభ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా సాంకేతిక రంగాన్ని అందిపుచ్చుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. ఇందులో కరస్పాండెంట్ ఎం.శ్రీనివాసరావు, ఏఎంసి ఛైర్మన్ గోపాలరాజు, ఛైర్మన్ బంగారునాయుడు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యార్థికి నిజాయితీ, క్రమశిక్షణ కీలకమైనవి'


