హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేధింపులపై వృద్ధులు ఫిర్యాదు చేయాలి: కలెక్టర్

BHPL: వృద్ధులకు పిల్లలు లేదా ఇతరుల నుంచి వేధింపులు, సమస్యలు ఎదురైతే వయోవృద్ధుల సంరక్షణ చట్టం ప్రకారం ఆర్డీవోకు దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సీనియర్ సిటిజన్లకు సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సౌకర్యాలు త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అత్యవసర సేవల కోసం 14567 కంట్రోల్ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.