హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రాణనష్టం తగ్గించే చర్యలు చేపట్టాలి: కలెక్టర్

సత్యసాయి: పుట్టపర్తిలో నిర్వహించిన రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశంలో e-DAR అమలుపై కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ సమీక్షించారు. ప్రమాదం జరిగిన విధానం, తీవ్రత, కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించాలని సూచించారు. పోలీస్, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో ప్రమాద వివరాలను సకాలంలో నమోదు చేసి, భవిష్యత్ ప్రమాదాలు, ప్రాణనష్టం తగ్గించే చర్యలు చేపట్టాలన్నారు.