హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భాకరాపేటలో తెగిపడిన 11 కేవీ విద్యుత్ లైన్

KDP: భాకరాపేట మూడు రోడ్ల కూడలిలో 11 కేవీ విద్యుత్ లైన్ తెగి కిందపడింది. తిరుపతి వైపు వెళ్లే ప్రయాణికులతో ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఆ సమయంలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు, గ్రామ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.