హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మొగల్తూరు ప్రజల కోసం అంగన్వాడీ పోషణ చైతన్యం

W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి సచివాలయ పరిధి చిక్కాలవారిమెరక అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం పోషణ ఉత్సవం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ద్వారా అంగన్వాడీ కేంద్రం నుంచి లబ్ధి పొందుతున్న వారికి సమగ్ర అవగాహన కల్పించారు. అనంతరం ICDS సూపర్వైజర్ శ్రీదేవి, స్థానిక నాయకులు రాంబాబు, బాలాజీలు అంగన్వాడీ కార్యకర్తలను ఘనంగా సత్కరించారు.