హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కరీంనగర్‌లో సీఎం సభా ఏర్పాట్లను పరిశీలించిన పొన్నం

KNR: కరీంనగర్‌లో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సభా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పర్యటన ఏర్పాట్లను, సభాస్థలిని మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ చిత్ర మిశ్రా, సీపీ గౌష్ ఆలం, అలాగే స్థానిక ఎమ్మెల్యేలు స్వయంగా పరిశీలించారు. భద్రతా పరంగా ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని, ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు.