జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో అటవీశాఖ, మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో గుర్వాయిగూడెంలో 'వృక్ష ప్రసాదం' పేరిట భక్తులకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేశారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఉసిరి, మారేడు, జామ, వేప, బాదం తదితర మొక్కలను అందజేశారు. ప్రతి ఒక్కరూ మొక్కను పెంచి పర్యావరణానికి సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో 'వృక్ష ప్రసాదం' పంపిణీ


