SRD: కోహిర్ (M) బిలాల్‌పూర్‌లో శేఖర్ (30) ఇంట్లో ఉరేసుకుని మృతి చెందాడు. చోరీ కేసులో అనుమానితుడిగా శేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో పోలీసులు కొట్టారని బంధువులు ఆరోపించారు. ష్యూరిటీపై విడుదలైన అనంతరం తిరిగి PSకు రావాలని పోలీసులు సూచించారని తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి శేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు పేర్కొన్నారు.
తెలంగాణ
పోలీసుల వేధింపులు.. యువకుడి ఆత్మహత్య?


