హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొడంగల్ బిడ్డనంటూ ఇళ్లు కూల్చేస్తావా: హరీశ్ రావు

VKB: కొడంగల్ బిడ్డనంటూ పేదల ఇళ్లను కూల్చేస్తావా అంటూ సీఎం రేవంత్‌పై మాజీమంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మద్దూరులో రాత్రికి రాత్రే బుల్డోజర్లతో ఇళ్లు కూల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నోటీసులు ఇవ్వకుండా కూల్చే హక్కు ఎవరిచ్చారు. కోర్టు తీర్పులను కూడా గౌరవించరా. ఏళ్లుగా నివసిస్తున్న వారు ఎక్కడికి వెళ్తారు. బాధితులకు పరిహారం ఇవ్వాలి' అని డిమాండ్ చేశారు.