హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కాకినాడ JNTUలో అక్టోబర్ 12న ప్రాంతీయ సదస్సు'

కాకినాడ: ఉభయ గోదావరి జిల్లాల స్థాయిలో అక్టోబర్ 12న కాకినాడ JNTUలో నిర్వహించనున్న ప్రాంతీయ సదస్సు ఏర్పాట్లను వేగవంతం చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. సదస్సు ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. ఈ సదస్సుకు రాష్ట్ర స్థాయి అధికారులు, గోదావరి జిల్లాల పారిశ్రామికవేత్తలు భారీగా హాజరుకానున్నారని ఆయన తెలిపారు.