హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై బీజేపీ నిరసన

SDPT: బీజేపీపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బెజ్జంకి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. సీఎం చిత్రపటాన్ని దహనం చేసి నిరసన తెలిపారు. బీజేపీ అన్ని దేవుళ్లను సమానంగా గౌరవిస్తుందని, తమ పార్టీపై అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొలిపాక రాజు, కరివేద మహిపాల్‌రెడ్డి, సొల్లు అజయ్‌వర్మ ఉన్నారు.