MBNR: నవాబుపేట ప్రైవేట్ స్కూల్ బస్ అసోసియేషన్ నూతన కార్యవర్గం SI వాకిటి నరేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. విద్యార్థుల భద్రత దృష్ట్యా డ్రైవర్లు మద్యం సేవించి, అతివేగంగా వాహనాలు నడపకూడదని ఎస్సై సూచించారు. బస్సుల కండిషన్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని తెలిపారు. అత్యవసర సమయంలో 112కు, పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి: SI


