హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

12వ సారి విజేతగా ఇండియన్ రైల్వేస్

TPT: శ్రీకాళహస్తిలో 72వ సీనియర్ నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ జరిగింది. ఇండియన్ రైల్వేస్ జట్టు 12వ సారి విజేతగా నిలిచి స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్ పోరులో రైల్వేస్ జట్టు 35-23, 36-11తో ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ను ఓడించింది. కలై సెల్వన్ నాయకత్వంలో విజేత జట్టుకు శశికుమార్ కోచ్గా, రమణమూర్తి మేనేజర్గా వ్యవహరించారు.