హైదరాబాద్: 28°C
తెలంగాణ

రష్యా మిలిటరీలో జిల్లా వాసులు.. కుటుంబాల్లో కలకలం

KMR: ఉపాధి కోసం రష్యాకు వెళ్లిన ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన నలుగురు అక్కడి మిలిటరీలో చిక్కుకున్నారని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారిలో బాన్సువాడ మండలం తాడ్కోల్‌కు చెందిన అఫ్జల్‌ ఖాన్‌ కూడా ఉన్నట్లు అతడి తమ్ముడు అంజద్‌ తెలిపారు. తమ వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.