హైదరాబాద్: 28°C
తెలంగాణ

చోరీ ఘటనపై పరిశీలన

MDK: శివ్వంపేట మండలం సికింద్లాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని దేవాదాయ ధర్మదాయ శాఖ ఉమ్మడి మెదక్ జిల్లా సహాయ కమిషనర్ విజయరామారావు మంగళవారం పరిశీలించారు. దేవాలయ నిర్వహణపై, అదేవిధంగా ఆలయంలో ఆదివారం రాత్రి జరిగిన చోరీ ఘటనపై అర్చకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందికి తగు సూచనలు చేశారు.