హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యా కమిటీ ఛైర్మన్‌గా రిజ్వాన్ భాషా

KRNL: ఎమ్మిగనూరు శ్రీ నీలకంటేశ్వర జడ్పీ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ ఛైర్మన్‌గా లాల్‌కోట్ రిజ్వాన్ భాషా, వైస్‌ఛైర్మన్‌గా పీ.హసీనా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హెచ్‌ఎం కే.శోభ అధ్యక్షతన పాఠశాల ఆవరణలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. పాఠశాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తానని రిజ్వాన్ భాషా తెలిపారు.