హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాచర్ల స్పెషల్ ఆఫీసర్‌గా ధనంజయరెడ్డి

ప్రకాశం: రాచర్ల మండల ప్రత్యేక అధికారిగా ధనంజయరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 23న మండల పరిషత్ పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కంభం పశుసంవర్ధక శాఖ ఏడీగా పనిచేస్తున్న ధనంజయరెడ్డి రాచర్ల మండల స్పెషల్ ఆఫీసర్‌గా మంగళవారం బాధ్యతలు చేపట్టారు. మండల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.