MDCL: ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలోని ఔషాపూర్ సమీపంలోని కేపాల్ వద్ద దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో 100కు పైగా గొర్రెలు మృతి చెందాయి. గొర్రెలు రైలు శబ్దానికి భయపడి పట్టాలపైకి రావడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతిచెందిన గొర్రెలు యాదాద్రి-భువనగిరి జిల్లా జూలూరు అలీనగర్‌కు చెందిన యజమానివని సమాచారం. ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: రైలు ఢీకొని 100కుపైగా గొర్రెలు మృతి


