హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళలకు సైబర్‌ క్రైమ్‌పై అవగాహన

BDK: దమ్మపేట ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం పోలీసులు సైబర్‌ క్రైమ్‌పై మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్‌ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్‌లైన్‌ మోసాల నుంచి రక్షణ పొందే విధానాలను వివరించారు. కార్యక్రమంలో పోలీసులు, ఫైనాన్స్‌ విభాగం అధికారులు, బ్యాంకు సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.