హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.30 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు

KNR: కరీంనగర్ నగరంలో అభివృద్ధి పనుల్లో భాగంగా మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావుతో కలిసి మంగళవారం 19, 49వ డివిజన్లలో పర్యటించారు. విద్యానగర్‌లో రూ.10 లక్షలతో, హరిహరనగర్‌లో రూ.20 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. పనులను నాణ్యత ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.