హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మా గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి'

ADB: తలమడుగు మండలం పల్సికె గ్రామానికి బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యార్థులు తెలిపారు. ఈ సమస్యను కలెక్టర్ రాజర్షి షా దృష్టికి తీసుకెళ్లేందుకు గ్రామానికి చెందిన విద్యార్థులు సోమవారం కలెక్టరేట్‌కు తరలివచ్చారు. పాఠశాల, కళాశాల విద్యతో పాటు కోచింగ్ కోసం ఆదిలాబాద్‌కు రావాల్సి వస్తోందని, సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు.