హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాయిగూడ ఆశ్రమ పాఠశాలలో పోషణ్‌ చర్చపై పరిశీలన

ADB: సిరికొండ మండలం రాయిగూడ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలను ఎంపీవో ఆడెపు సంతోష్, సర్పంచ్ పెందూర్ లక్ష్మణ్‌రావుతో కలిసి సందర్శించారు. పోషణ్ చర్చలో భాగంగా వంటగది పరిశుభ్రత, కూరగాయలు, బియ్యం, పప్పుధాన్యాల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం గుడ్డు, పాలు, పౌష్టికాహారం అందుతున్నాయా అని ఆరా తీశారు. సురక్షిత తాగునీరు అందించాలని, కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని సూచించారు.