ASF: బెజ్జుర్ మండలంలోని విద్యార్థులందరికీ సమాన విద్య అందిస్తున్నామని MEO సునీత బుధవారం అన్నారు. మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రాథమిక, జడ్పీ, గిరిజన ఆశ్రమ, కేజీబీవీ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి బడిలో మెరుగైన విద్యతో పాటు రుచికరమైన మధ్యాహ్న భోజనం, అన్ని వసతులు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.
తెలంగాణ
VIDEO: 'విద్యార్థులందరికీ సమాన విద్య అందిస్తున్నాం'


