హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ స్థాయి ఓపెన్ కరాటేలో సత్తా చూపిన విద్యార్థినిలు

PDPL: ఓదెల మండలం పొత్కపల్లి పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ విద్యార్థినులు జాతీయ స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్–2026లో సత్తాచాటారు. అండర్–14 వెపన్ డబుల్ నాంచక్ కటాస్ విభాగంలో కందుల అమూల్య స్వర్ణ పతకం సాధించగా, అండర్-14 కటాస్లో ఎర్ర అస్మిత స్వర్ణం, గంగారపు కీర్తి రజత పతకం సాధించారు. విజేతలను ఎంఈనో వై.రమేశ్, హెచ్ఎం ఏభూసి శ్రీనివాస్ అభినందించారు.