హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: MLA

WGL: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ముస్లిం మైనార్టీల షాదీఖానా నిర్మాణానికి 0.25 గుంటల స్థల కేటాయింపు పత్రాన్ని MLA రాజేందర్‌రెడ్డి మత పెద్దలకు అందజేశారు. ఇవాళ క్షేత్రస్థాయిలో స్థలాన్ని పరిశీలించిన ఆయన, రహదారి సౌకర్యం, భవిష్యత్ నిర్మాణానికి అనుకూలతను దృష్టిలో ఉంచుకుని స్థలాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే వెల్లడించారు.