హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం

VKB: ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా తాండూర్‌లో ఐఎంఏ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐఎంఏ అధ్యక్షుడు డా. జయప్రసాద్ మాట్లాడుతూ.. రోజూ వ్యాయామం చేయాలని, పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. పొగతాగడం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని, గుండె సంబంధిత లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు.