BDK: టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామంలో సాగు చేస్తున్న పత్తి పంటలను మంగళవారం కేవీకే సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ డాక్టర్ టి.భరత్ పరిశీలించారు. పంట ఎదుగుదల, సాగు పరిస్థితులు, చీడపీడల ఉద్ధృతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులతో పంట సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పత్తిలో చీడపీడల నివారణ, సమగ్ర పంట యాజమాన్య పద్ధతులుపై రైతులకు సూచనలు చేశారు.
తెలంగాణ
పత్తి పంటలను పరిశీలించిన సీనియర్ సైంటిస్ట్


