హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీవో భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన MLA

ADB: ఇచ్చొడ మండల కేంద్రంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న వీవో భవనానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంగళవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా కేజీబీవీ పాఠశాలను సందర్శించి కాంపౌండ్ వాల్ పనులను పరిశీలించారు. త్వరలో రూ.7 కోట్ల నిధులతో విద్యాభివృద్ధి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.