NGKL: వంగూర్ మండల కేంద్రంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో ఖాతాదారులకు నగదు అందకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఖాతాల్లో డబ్బులు ఉన్నప్పటికీ, బ్యాంకులో నగదు లేదని సిబ్బంది చెబుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. నగదు తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లిన సమయంలో, బ్యాంకులో డబ్బులు లేవని, లాకర్ కీ కూడా అందుబాటులో లేదని సిబ్బంది చెప్పినట్లు ఖాతాదారులు పేర్కొంటున్నారు.
తెలంగాణ
ఖాతాల్లో డబ్బులు ఉన్నా.. బ్యాంకులో నగదు లేదు


