హైదరాబాద్: 28°C
తెలంగాణ

'AISF విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతుంది'

BDK: 90 ఏళ్ల చరిత్ర కలిగిన ఏఐఎస్ఎఫ్ స్వాతంత్య్ర ఉద్యమం నుంచి నేటి వరకు శాస్త్రీయ విద్య, విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతోందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం ఏఐఎస్ఎఫ్ 90 వ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. విద్యారంగంలో కాషాయీకరణ వ్యతిరేకిస్తూ విద్యార్థులు ముందుకు రావాలన్నారు.