ASF: కాగజ్ నగర్ పట్టణంలోని కౌసర్ నగర్‌కు చెందిన చిన్నారి జాడి సంజన సిస్టమిక్ లూపస్ ఎరైథెమేటోసిస్ (SLE) అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు బాధిత కుటుంబాన్ని కలిశారు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కొరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ. 3.20 లక్షల లెటర్ ఆఫ్ క్రెడిట్‌ను వారికి అందజేశారు.
తెలంగాణ
CMRF చెక్కును అందజేసిన ఎమ్మెల్యే హరీష్ బాబు


