WGL: పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో పది రోజులుగా నిర్వహించిన NCC కంబైన్డ్ ఆన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ ముగిసింది. క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ డి.వి.సంతోష్ మెహెర్ ఆధ్వర్యంలో 700 మంది క్యాడెట్లు డ్రిల్, ఫైరింగ్, మ్యాప్ రీడింగ్, డ్రోన్, విపత్తుల నిర్వహణ, సైబర్ క్రైమ్ తదితర అంశాల్లో శిక్షణ పొందారు. అనంతరం వివిధ పోటీల విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు.
తెలంగాణ
'ముగిసిన NCC శిక్షణ శిబిరం'


