హైదరాబాద్: 28°C
తెలంగాణ

కన్నాయిగూడెం SIగా పుట్ట సతీష్ బాధ్యతలు

MLG: కన్నాయిగూడెం పోలీస్‌స్టేషన్‌ ఎస్సై‌గా పుట్ట సతీష్ సోమవారం సాయంత్రం 7 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. గతంలో ములుగు–వెంకటాపూర్ ప్రాంతంలో విధులు నిర్వహించిన ఆయన బదిలీపై కన్నాయిగూడెం ఎస్‌ఐగా నియమితులయ్యారు. ఇక్కడ పనిచేసిన ఎస్‌ఐ వెంకటేష్ ఆసిఫాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.