హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'దసరాలోపు డివిజన్ ఏర్పాటు చేయాలి'

MDK: రామాయంపేటను డివిజన్‌గా పునరుద్ధరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రజల కోరిక మేరకే ఈ డిమాండ్ చేస్తున్నామని, దసరాలోపు డివిజన్ ఏర్పాటు చేయకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.