హైదరాబాద్: 28°C
తెలంగాణ

సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకున్న జడ్జి

WGL: గీసుగొండ మండలం ఊకల్ హవేలిలో ప్రసిద్ధిచెందిన శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి నిర్మల గీతాంబ మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జడ్జి స్వామి వారికి పూజలు నిర్వహించగా, ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శనాచార్యులు ఆమెను ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుభాష్ గౌడ్, సీఐ విశ్వేశ్వర్, తదితరులున్నారు.