హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుమారస్వామి సేవలు చిరస్మరణీయం : మంత్రి

MLG: దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ డీసీసీ అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి సేవలు మరువలేనివని మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ బలోపేతానికి, ములుగు జిల్లా సాధన ఉద్యమానికి ఆయన చేసిన కృషి ప్రత్యేకమన్నారు. ప్రజా సమస్యల కోసం పనిచేసిన ఆయన ఆశయాలను నేటి తరం కొనసాగించాలని సీతక్క పిలుపునిచ్చారు.