KMM: గ్రామ పాలన అధికారులు (జీపీఓ)ల పనిభారాన్ని తగ్గించాలని, సెలవు దినాల్లో పని చేయించకుండా చూడాలని తెలంగాణ గ్రామపాలన ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చీమల నాగేంద్రబాబు కోరారు. మంగళవారం కలెక్టర్ దివాకరను కలిసి వినతిపత్రం అందించారు.పెండింగ్‌లో ఉన్న సర్వీస్ పరమైన అంశాలను పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు జీపీవోలు పాల్గొన్నారు.
తెలంగాణ
'కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసిన జీపీవోలు'


