హైదరాబాద్: 28°C
తెలంగాణ

రొంపల్లిలో నూతన రేషన్ కార్డుల పంపిణీ

VKB: బంట్వారం మండలంలోని రొంపల్లి గ్రామంలో నూతన రేషన్ కార్డులను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి మంగళవారం లబ్ధిదారులకు అందజేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.