హైదరాబాద్: 28°C
తెలంగాణ

' సమరభేరి సభ పోస్టర్ ఆవిష్కరణ'

MHBD: కాన్షిరాం 20వ వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 9న వరంగల్ ఊర్సుగుట్టలోని నాని గార్డెన్‌లో బహుజన రాజ్యాధికార సమరభేరి సభ నిర్వహించనున్నట్లు బీఎస్పీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎల్. విజయ్‌కాంత్ తెలిపారు. ఇవాళ అంబేద్కర్ విగ్రహం వద్ద సభ పోస్టర్లను విడుదల చేశారు. బహుజన సమాజం ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువలపై సభలో చర్చిస్తామని తెలిపారు.