హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భూ రీ-సర్వేతో సమస్యలకు శాశ్వత పరిష్కారం'

BHPL: భూ రీ-సర్వే ద్వారా రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ తెలిపారు. రేగొండ మండలం లింగాలలో కొనసాగుతున్న రీ-సర్వేను ఆయన పరిశీలించారు. సర్వేను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూ సరిహద్దుల నిర్ధారణలో రైతుల భాగస్వామ్యం ఉండాలన్నారు.