హైదరాబాద్: 28°C
తెలంగాణ

పార్కుల్లో హార్టికల్చర్ అధికారి తనిఖీలు..!

ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని పార్కులను హార్టికల్చర్ ఆఫీసర్ రాధిక మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మొక్కల సంరక్షణ, పిచ్చిగడ్డి తొలగింపు, పారిశుధ్యం, ఓపెన్ జిమ్‌ల పనితీరును ఆమె తనిఖీ చేశారు. నగర ప్రజలకు ఆహ్లాదం పంచేలా పార్కులను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, మొక్కలను కాపాడాలని ఆమె సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.