హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గంజాయి అక్రమ రవాణాపై పోలీసుల నిఘా..!

ASF: ఆసిఫాబాద్ పట్టణంలో స్థానిక ఎస్సై జాదవ్ ఉల్లాస్ ఆధ్వర్యంలో డాగ్‌స్కాడ్‌తో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారిపై వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానిత వాహనాలను ప్రత్యేకంగా తనిఖీ చేశారు. గంజాయి అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు నిషేధిత పదార్థాల తరలింపును నిరోధించేందుకు తనిఖీలు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.