NRPT: ధన్వాడ మండలం కిష్టాపూర్‌లో రాత్రివేళ ఆర్టీసీ బస్సు స్టే చేయాలని సర్పంచ్ కొండయ్య పాలమూరు డిపో మేనేజర్‌కు వినతిపత్రం ఇచ్చారు. గతంలో బస్సు గ్రామంలో నిలిచేదని, ప్రస్తుతం ఆగకపోవడంతో కిష్టాపూర్‌తో పాటు ఏడు తండాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. సమస్య పరిష్కారానికి మేనేజర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
తెలంగాణ
కిష్టాపూర్‌లో బస్సు స్టే చేయాలని వినతి


