హైదరాబాద్: 28°C
తెలంగాణ

పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్

WGL: ఉనికిచర్ల ఔటర్ రింగ్ రోడ్డులో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కమిషనర్ వెంకన్న పరిశీలించారు. అనంతరం స్వచ్ఛ ఆటోలు ప్రతిరోజూ వస్తున్నాయా, తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నారా, చెత్త సేకరణ సేవలు సక్రమంగా అందుతున్నాయా అని ఆరా తీశారు.  ఫీకల్ స్లడ్జ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు డీస్లడ్జింగ్ వాహనాలను క్రమం తప్పకుండా పంపించాలని అధికారులను కోరారు.