హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇవాళ, రేపు జిల్లాలో తెలంగాణ స్టేట్ ఫుడ్ కమిషన్ పర్యటన

ADB: తెలంగాణ స్టేట్ ఫుడ్ కమిషన్ ఛైర్మన్, సభ్యులు ఈ నెల 29, 30 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారని అధికారులు తెలిపారు. పర్యటనలో భాగంగా పాఠశాలలు, హాస్టళ్లు, రేషన్ దుకాణాలు, అంగన్‌వాడీ కేంద్రాలను వారు ఆకస్మికంగా తనిఖీ చేయనున్నారు. అలాగే సెప్టెంబర్ 30న కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.