హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆడపిల్లల జననాలపై వివక్ష

MHBD: జిల్లాలో ఆడపిల్లల జననాలపై వివక్ష కొనసాగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర జనగణన పౌర నమోదు వ్యవస్థ (CRS)-2024 నివేదిక ప్రకారం, 2024లో జిల్లాలో మొత్తం 11,854 జననాలు నమోదయ్యాయి. ఇందులో 6,568 మంది మగపిల్లలు, 5,286 మంది ఆడపిల్లలు ఉన్నారు. అంటే మగపిల్లల కంటే ఆడపిల్లలు 1,282 మంది తక్కువగా నమోదయ్యారు. ఈ వ్యత్యాసం ఆడపిల్లల పట్ల కొనసాగుతున్న వివక్షపై ఆందోళన కలిగిస్తోంది.