హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జాతీయ స్థాయిలో సిరిసిల్ల అమ్మాయి.. అండగా KTR

SRCL: జాతీయ స్థాయి మహిళల అండర్-19 క్రికెట్ టోర్నమెంట్ కు గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటకు చెందిన అక్షర చోటుదక్కించుకుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. అక్షర క్రికెట్ ప్రయాణానికి అవసరమైన సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ జాతీయ స్థాయ టోర్నీ జమ్మూ కశ్మీర్‌లో జరగనుంది.